Fri Dec 05 2025 11:36:32 GMT+0000 (Coordinated Universal Time)
స్కూల్లో బస్ కిందపడి చిన్నారి మృతి
తాజాగా స్కూల్ బస్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది. సోమవారం ఉదయం..

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ రహదారులు నెత్తురోడుతున్నారు. అతివేగం లేదా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో పిల్లలు, పెద్దలు కన్నుమూస్తున్నారు. తాజాగా స్కూల్ బస్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది. సోమవారం ఉదయం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ కి వెళ్లేందుకు ఆ చిన్నారి స్కూల్ బస్సెక్కింది. స్కూల్ వద్ద బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. అదిగమనించని డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో.. ఆ చిన్నారి మీది నుంచి బస్సు వెళ్లగా.. అక్కడికక్కడే మరణించింది.
జిల్లాలోని జమ్మలమడుగులో ఓ స్కూల్ బ్సు కిందపడి చిన్నారి జీనా మృతి చెందింది. విశ్వశాంతి స్కూల్ లో చదువుతున్న జీనా.. ఆ స్కూల్ బస్ కిందే పడి మరణించడంతో పాఠశాలలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సదరు డ్రైవర్ పై యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, చిన్నారి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
Next Story

