Sun Mar 15 2026 14:07:48 GMT+0530 (India Standard Time)
నాటు తుపాకీ పేలి చిన్నారి మృతి
కాకినాడ జిల్లా తుని మండలంలో విషాదం చోటుచేసుకుంది.

కాకినాడ జిల్లా తుని మండలంలో విషాదం చోటుచేసుకుంది. వివరాళ్లోకెళితే.. లోవ కొత్తూరులో నాటు తుపాకీ పేలి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. నాటు తుపాకీతో పందులను చంపేందుకు కాల్పులు జరిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. మంగళవారం రోజు ఉదయం లోవ కొత్తూరులో పెంపుడు పందులను చంపేందుకు గ్రామస్తులు నాటు తుపాకీని ఉపయోగించారు. ఆ సమయంలో ఇంటి బయట ఆడుకుంటున్న అనే నాలుగేళ్ల చిన్నారికి తూటా తగిలి కుప్పకూలిపోయింది. గ్రామస్తులు ధన్యశ్రీని ఆసుపత్రికి తరలిస్తుండగా బాలిక మార్గమధ్యంలో మరణించింది. నిబంధనలకు విరుద్ధంగా నాటు తుపాకులను ఉపయోగించిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

