Tue Mar 17 2026 06:01:29 GMT+0530 (India Standard Time)
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే నలుగురి మృతి
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట వద్ద కారును లారీ ఢీకొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు. నార్పల వైపు వెళుతున్న కారును లారీ ఢీ కొనడంతో కారు నుజ్జునుజ్జయింది.
కారును లారీ ఢీకొట్టడంతో...
కారులో ఉన్న వారిలో నలుగురు మరణించారు. మృతులు అనంతపురంలోని సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాధమిక విచారణలో గుర్తించారని తెలిసింది.
Next Story

