Sat Mar 07 2026 15:47:51 GMT+0530 (India Standard Time)
విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు మృతి
సిలిండర్ పేలుడు ధాటికి పై కప్పు కూలిపోయింది. ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు..

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని శెట్టూరు మండలం ములకలేడులో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సిలిండర్ పేలుడు ధాటికి పై కప్పు కూలిపోయింది. ప్రమాద ఘటనపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించినవారి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story

