Sun Mar 22 2026 04:51:29 GMT+0530 (India Standard Time)
Road Accident : రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురి మృతి
ఘజియాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.

ఘజియాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. ఆగి ఉన్న డీసీఎంను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ లోని మురాద్ నటర్ ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే పై రేవారి రేవాడ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
24 మందికి గాయాలు...
24 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు.
Next Story

