Sat Mar 07 2026 19:48:53 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు

అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. వాహనం ఢీకొని నలుగురు అక్కడికక్కడే మరణించారు. కారును ఒక వాహనం ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. వీరిలో నలుగురు చనిపోగా, మరొకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
కారును ఢీకొట్టడంతో...
పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కారును ఢీకొన్న వాహనం ఏదై ఉంటుందన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు ను దర్యాప్తు చేస్తున్నారు. మృతులు ఎక్కడి వారన్నది వివరాలు తెలియాల్సి ఉంది
Next Story

