Fri Dec 05 2025 13:35:58 GMT+0000 (Coordinated Universal Time)
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు మృతి
శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో

కర్ణాటకలోని కలబురగి సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కలబురగి నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని మారగుట్టి క్రాస్ వద్ద మహీంద్రా పికప్ వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కమలాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం జరిగింది.,
కారులో ప్రయాణిస్తున్న నలుగురు గణగాపూర్ ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో ఇద్దరిని భార్గవ్ కృష్ణ, అతని భార్య సంగీతగా గుర్తించారు. మిగిలిన ఇద్దరి వివరాలను తెలుసుకోడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు కర్ణాటక పోలీసులు తెలిపారు.
Next Story

