Sat Mar 07 2026 19:52:31 GMT+0530 (India Standard Time)
ఆ సీఐ చేష్టలు దారుణం : టీజీ వెంకటేష్
మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు

మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కోరారు. అతని అన్యాయాలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. తనను ఒక ఆస్తి కేసులో అన్యాయంగా ఇరికించాడని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. తనకు సంబంధం లేదని చెప్ినా వినలేదని, పేరు తొలగించడంలో జాప్యం చేశాడని ఆయన పేర్కొన్నారు. ఉన్నతాధికారులకు కోట్ల రూపాయలు ఇచ్చి నాగేశ్వరరావు పోస్టింగ్ తెచ్చుకున్నాడని ఆయన ఆరోపించారు. నాగేశ్వరరావు వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
మహిళ ఫిర్యాదుపై...
హైదారాబాద్ లోని మారేడు పల్లి సీఐ నాగేశ్వరరావు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వివాహిత కేసు నమోదు చేసింది. దీనిపై టీజీ వెంకటేష్ స్పందించారు. ఆ మహిళ తనై అత్యాచారం చేయడంతో పాటు తన భర్తను రివాల్వర్ తో బెదిరించారని కూడా కేసు పెట్టింది. ఈ కేసులో నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని టీజీ వెంకటేష్ కోరారు. ఇప్పటికే ఉన్నతాధికారులు నాగేశ్వరరావును విధుల నుంచి సస్పెండ్ చేవారు.
Next Story

