Sat Jan 31 2026 21:35:04 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురంలో వైసీపీ నేత దారుణ హత్య
హిందూపురం మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు

హిందూపూరంలో దారుణ హత్య చోటు చేసుకుంది. హిందూపురం మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఐదుగురు వేట కొటవళ్లతో నరికి చంపారు. హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కృషి చేసిన వారిలో రామకృష్ణారెడ్డి ఒకరు. ఆయనను ఇంటి వద్దనే కాపుకాచిన దుండగులు ముసుగులు వేసుకుని వచ్చి నరిక చంపారు.
సూరి సోదరుడు...
మద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డి పిన్నమ్మ కుమారుడు రామకృష్ణారెడ్డి. 2010లో హిందుపురం నుంచి ఇడుపులపాయ వరకూ 180 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అప్పట్లో జగన్ అక్రమ అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ వరకూ పాదయాత్ర చేశఆరు. అయితే ఎవరు హత్య చేసి ఉంటారన్నది ఇంకా తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తును ప్రారంభించారు.
Next Story

