Mon Sep 09 2024 12:54:01 GMT+0000 (Coordinated Universal Time)
సముద్ర స్నానానికి దిగి ఐదుగురు గల్లంతు.. వారిలో ముగ్గురిని రక్షించిన పోలీసులు
కృష్ణా జిల్లా హంసల దీవిలో ఐదుగురు గల్లంతయ్యారు. వెంటనే మెరైన్ పోలీసులు ముగ్గురిని రక్షించారు
కృష్ణా జిల్లా హంసల దీవిలో ఐదుగురు గల్లంతయ్యారు. సెలవురోజున బీచ్ లో గడుపుదామని వచ్చిన వారు గల్లంతయిన వెంటనే మెరైన్ పోలీసులు ముగ్గురిని రక్షించారు. అయితే ఇరవై ఏడేళ్ల మహిళ సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయింది. గుడివాడకు చెందిన ఆరుగురు సముద్ర స్నానాలు చేసేందుకు హంసల దీవికి వచ్చారు.
అలలు ఎగిసి పడుతున్నా...
అయితే అలలు భారీ స్థాయిలో వస్తున్నా వాటిని లెక్క చేయకుండా సముద్రంలోకి దిగారు. ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోగా, అందులో ముగ్గురిని మెరైన్ పోలీసులు రక్షించగలిగారు. మరొక వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు రక్షించిన వారిలో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story