Thu Mar 19 2026 02:02:52 GMT+0530 (India Standard Time)
మృతుల్లో ఐదుగురు వీరే
సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారిలో ఐదుగురిని గుర్తించారు

సికింద్రాబాద్ లోని రూబీ హోటల్ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారిలో ఐదుగురిని గుర్తించారు. హరీష్, వీతేంద్ర, సీతారామన్, యశోద, బాలాజీలు ఉన్నట్లు గుర్తించారు. మిగలిన ముగ్గురిని గుర్తించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 37 ఎలక్ట్రిక్ బైకులున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. దర్యాప్తు జరుపుతున్నామని, త్వరలోనే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని నార్త్ జోన్ డీజీపీ చందనదీప్తి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన బెంగళూరుకు చెందిన జయంత్ పరిస్థిితి విషమంగా ఉందని పోలీసులు చెబుతున్నారు.
మూడు లక్షల ఎక్స్ గ్రేషియో....
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియో ప్రకటించారు. ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు కేసీఆర్ ఆదేశించారు.
Next Story

