Fri Dec 05 2025 14:37:37 GMT+0000 (Coordinated Universal Time)
రెచ్చిపోయిన మైనర్లు.. 21 ఏళ్ల వ్యక్తి దారుణహత్య
ఏదో విషయంపై వాళ్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఆ గొడవల్లో

ఢిల్లీలోని మయూర్ విహార్‌లో మైనర్లు రెచ్చిపోయారు. గొడవలో భాగంగా ఐదుగురు మైనర్లు కలిసి తుషార్ అనే 21 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రిలోక్‌పురి ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు మయూర్ విహార్ పోలీస్ స్టేషన్‌కు కాల్ వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. గాయపడిన వ్యక్తిని అప్పటికే ఎల్బీఎస్ ఆస్పత్రికి తరలించినట్లు గుర్తించారు. ఎల్బిఎస్ ఆసుపత్రిలో బాధితుడు తుషార్ మరణించినట్లు ప్రకటించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు పలు ఆధారాలు సేకరించారు.
హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యక్ష సాక్షులను విచారించారు. CCTV ఫుటేజీని విశ్లేషించగా, ఐదుగురు వ్యక్తులు మొత్తం మైనర్లు కలిసి ఈ దాడికి పాల్పడ్డారు. ఐదుగురిని అనుమానితులుగా గుర్తించి. వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో బాధితుడికి మైనర్లతో పరిచయం ఉందని తెలుస్తోంది. ఏదో విషయంపై వాళ్ల మధ్య వాగ్వాదం జరగడంతో.. ఆ గొడవల్లో కత్తితో పొడిచారు. ఆ తర్వాత బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను విడిచాడు.
News Summary - Five minors stab 21-year-old to death after altercation in Delhi Mayur Vihar
Next Story

