Tue Sep 10 2024 11:51:31 GMT+0000 (Coordinated Universal Time)
బంగారం షాపులో భారీ చోరీ..5 కిలోల నగలు స్వాహా
రవి జ్యూయలర్స్ షాపుకి మంగళవారం సెలవు కావడంతో.. షాపులో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
విజయనగరం నగరంలోని రవి జ్యూయలర్స్ లో భారీ చోరీ జరిగింది. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న.. గంటస్తంభం సమీపంలో ఉన్న దుకాణంలో దుండగులు ఏకంగా 5 కిలోల ఆభరణాలు దోచుకెళ్లారు. షాపు పై కప్పు నుంచి దుకాణంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. రవి జ్యూయలర్స్ షాపుకి మంగళవారం సెలవు కావడంతో.. షాపులో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. బుధవారం ఉదయం షాపు యజమాని షాపును తెరిచి చూడగా.. అల్మరాల్లో ఉండాల్సిన నగలు కనిపించలేదు.
Also Read : మహబూబాబాద్ లో గ్యాంగ్ రేప్.. యువతి మృతి
దాంతో షాపులో దొంగతనం జరిగిందని గ్రహించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. షాపు యజమాని ఫిర్యాదుతో సీఐ శ్రీనివాసరావుతో కలిసి షాపును పరిశీలించిన విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులు సీసీ కెమెరాలకు చిక్కకుండా బంగారాన్ని దోచుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. చోరీ జరిగిన ప్రాంతంలో ప్రత్యేక బృందాలు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ద్వారా ఆధారాలు సేకరించారు.
Next Story