Sat Sep 14 2024 23:33:01 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హైదరాబాద్ లో కాల్పుల కలకలం
హైదరాబాద్ లోని గాజుల రామారం లో కాల్పులు జరిగాయి. నరేష్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపారు.
హైదరాబాద్ లోని గాజుల రామారం లో కాల్పులు జరిగాయి. నరేష్ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డులపై కాల్పులు జరిపారు. బార్ బయట ఉన్న వాహనాల్లో పెట్రోలు దొంగిలించేందుకు వచ్చిన నరేష్ ను అక్కడి సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు జీడిమెట్ల పరిధిలో ఈ కాల్పుల ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మూడు రౌండ్ల కాల్పులు...
నరేష్ మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. సెక్యూరిటీ సిబ్బంది నరేష్ ను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఈ కాల్పులు జరిపారు. అయితే కాల్పులు జరిపిన నరేష అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బార్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఘటనస్థలిని పరిశీలిస్తున్నారు.
Next Story