Sun Mar 08 2026 06:01:22 GMT+0530 (India Standard Time)
సీఆర్పీఎఫ్ క్యాంప్ లో కాల్పులు.. ఇద్దరు మృతి
సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణలోని ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. వెంకటాపురం సీఆర్పీఎఫ్ 39 బెటాలియన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ ఎస్ఐ ఉమేష్ చంద్ర, జవాను స్టీఫెన్ లు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరూ మృతి చెందారు.
పరస్పరం కాల్పులు...
కాల్పులు పరస్పరం జరుపుకోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతున్నారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలే కాల్పులకు దారితీశాయని తోటి జవాన్లు చెబుతున్నారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ లో కాల్పులు జరగడంతో ఉన్నతాధికారులు ఘటన స్థలికి చేరుకుంటున్నారు.
Next Story

