Thu Jan 29 2026 07:59:46 GMT+0000 (Coordinated Universal Time)
గాలిలోకి కాల్పులు : రెండు లక్షల దోపిడీ
మేడ్చల్ లో కాల్పుల కలకలం రేగింది. గాల్లోకి కాల్పులు జరిపి రెండు లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళారు

మేడ్చల్ లో కాల్పుల కలకలం రేగింది. గాల్లోకి కాల్పులు జరిపి రెండు లక్షల రూపాయలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్ళారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ప్రజలు భయపడి పోయారు. శామీర్పేట్ వద్ద ఒక మద్యం దుకాణం వద్ద కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దుండగులు మొత్తం మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
మూడు రౌండ్లు...
చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు ఆగంతకులు గాలిలోకి కాల్పులు జరిపి నగదు దోపిడీకి పాల్పడ్డారని, నిందితుల కోసం గాలిస్తున్నామని, నిందితులు అంతరాష్ట్ర ముఠాగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.
Next Story

