Sun Mar 08 2026 00:29:03 GMT+0530 (India Standard Time)
అమృత్ సర్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం
గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో మంటలు ఎగసి పడుతున్నాయి.

ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటన మరువక ముందే.. నేడు అమృత్ సర్ లో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆస్పత్రిలో మంటలు ఎగసి పడుతున్నాయి. ఘటనా ప్రాంతానికి చేరుకున్న 8 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. కాగా.. అక్కడున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పేలడంతోనే మంటలు అంటున్నట్లు తెలుస్తోంది. ఆస్పత్రిలో ఉన్న రోగుల బంధువులు, సిబ్బంది భయంతో బయటికి పరుగులు తీయగా.. చాలా మంది రోగులు ఆస్పత్రి లోపలే ఉన్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

