Mon Sep 09 2024 12:55:34 GMT+0000 (Coordinated Universal Time)
Fire Accident : పెళ్లి వేడుకలో విషాదం.. ఒకే కుటుంబంలో ఆరుగురి మృతి
బీహార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి ఆరుగురు మృత్యువాత పడ్డారు
బీహార్ లో అగ్నిప్రమాదం సంభవించింది. పెళ్లి వేడుకలో అగ్నిప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి ఆరుగురు మృత్యువాత పడ్డారు. బీహార్ లోని దర్భంగా ప్రాంతంలో జరిగిన ఒక వివాహ వేడుకలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో పెళ్లి వేడుకను చూసేందుకు వచ్చిన వారు బయటకు పరుగులు తీశారు. అయితే ఈ సందర్భంగా ఆరుగురు మరణించగా, అనేక మందికి గాయాలయ్యాయి. బాణాసంచా కాల్చడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.
బాణా సంచా పేలి...
బాణాసంచా పేలి గ్యాస్ సిలిండర్ కు అంటుకుని, ఆ పక్కనే ఉన్న డీజిల్ స్టాక్ కు కూడా వ్యాపించడంతో భారీ పేలుడు సంభవించినట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
Next Story