Wed Jan 28 2026 17:48:33 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీనగర్ లో భారీ అగ్నిప్రమాదం.. ఆందోళనలో స్థానికులు
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాజ్ బాగ్ లోని వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు..

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం రాజ్ బాగ్ లోని వాణిజ్య భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో భవనంలో ఉన్నవారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా ప్రమాద స్థలానికి చేరుకుని ఫైరింజన్ సాయంతో మంటలను అదుపుచేశారు.
Also Read : ప్రియుడిని పెళ్లాడిన "నాగిని" నటి మౌనీ రాయ్
కాగా.. భవనంలోని సిలిండర్ పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ కమర్షియల్ భవనంలో అనేక కంపెనీల ఆఫీసులున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

