Fri Dec 05 2025 19:11:57 GMT+0000 (Coordinated Universal Time)
సజీవ దహనం.. హత్యేనా?
కోనసీమ జిల్లాలో ఘోర్ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగి తల్లీ కూతుళ్లు సజీవదహనమయ్యారు

కోనసీమ జిల్లాలో ఘోర్ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగి తల్లీ కూతుళ్లు సజీవదహనమయ్యారు. ఈరోజు తెల్లవారు జామును ఈ ఘటన జరిగింది. అల్లవరం మండలంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో ఉన్న సాధనాల మంగాదేవి, మేడిశెట్టి జ్యోతి సజీవ దహనమయ్యారు. జ్యోతి గర్భవతిగా ఉంది.
సజీవ దహనం.. హత్యేనా?
ప్రేమ వివాహం....
అయితే జ్యోతి ఐదు నెలల క్రితం జ్యోతి ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో హత్య చేసి ఇల్లు తగలపెట్టారా? లేక ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందా? అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగానే పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story

