Thu Sep 12 2024 11:14:57 GMT+0000 (Coordinated Universal Time)
జీహెచ్ఎంసీ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. లిఫ్త్ లో ఆర్తనాదాలు
సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని
సికింద్రాబాద్ లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్న సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ కార్యాలయంలోని 3వ అంతస్తులోని టాక్స్ సెక్షన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగసి పడటంతో.. ఆందోళనకు గురైన ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా.. ఫైరింజన్లతో వారు ఘటనా ప్రాంతానికి చెరుకునే లోపే ముఖ్యమైన ఫైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
అగ్నిప్రమాదం జరగ్గానే అప్రమత్తమైన కార్యాలయ సిబ్బంది.. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాంతో లిఫ్ట్ లో ఉన్నవారు కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. దట్టమైన పొగ కారణంగా టెర్రస్ పై ఉన్న వారు కిందికి దిగే అవకాశం లేకపోవడంతో.. వారిని జాగ్రత్తగా కిందికి తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story