Sun Feb 01 2026 22:34:34 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం..
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని.. రెండుగంటల పాటు శ్రమించిన

హైదరాబాద్ లోని గాంధీనగర్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జబ్బార్ కాంప్లెక్స్ పక్కనున్న అసెంబుల్ వాటర్ ఫిల్టర్ దుకాణంలో గత అర్థరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో ఆ మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని.. రెండుగంటల పాటు శ్రమించిన మంటలను ఆర్పివేశారు. కాగా.. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

