Mon Dec 09 2024 06:43:22 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. కొడుకు ఆత్మహత్యను భరించలేక తండ్రి కూడా..
ఈనెల 14వ తేదీన తన పుట్టినరోజును స్నేహితులతో కలిసి స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది తెలిసిన స్కూల్ యాజమాన్యం
కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. తట్టుకోలేక తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటన పలువురి హృదయాలను కలచివేసింది. జిల్లాలోని సత్తుపల్లికి చెందిన చల్ల భానుప్రకాష్ అనే విద్యార్థి ఖమ్మంలోని ఒక ప్రైవేటు స్కూల్ లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 14వ తేదీన తన పుట్టినరోజును స్నేహితులతో కలిసి స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇది తెలిసిన స్కూల్ యాజమాన్యం భానుప్రకాష్ ను స్కూల్ నుంచి వారంరోజులపాటు సస్పెండ్ చేసింది. దాంతో సత్తెనపల్లిలోని తన స్వగృహానికి వచ్చాడు.
పురుగుల మందు తాగి..
స్కూల్ నుంచి సస్పెండ్ చేయడంతో తీవ్రమనస్తాపానికి గురైన భాను ప్రకాష్ తన స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడుతూనే.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. భానుప్రకాష్ పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఈ నెల 16వ తేదీన భాను మరణించాడు. స్వగ్రామానికి కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు తల్లిదండ్రులు. కొడుకు ఆత్మహత్యను భరించలేకపోయాడు తండ్రి రాంబాబు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటినుంచి బయటికి వెళ్లాడు. రాంబాబు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో అతనికోసం కుటుంబ సభ్యులు ఆ ప్రాంతమంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు.
చెట్టుకు ఉరివేసుకుని..
ఉదయం అయినా ఇంకా ఇంటికి రాలేదు. కంగారు పడిన కుటుంబ సభ్యులు మరోసారి ఊరంతా గాలించగా.. కుమారుడిని ఖననం చేసిన ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్న ఒక చెట్టుకు ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఇలా తండ్రి - కొడుకుల వరుస ఆత్మహత్యలతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం భాను ప్రకాష్ ను సస్పెండ్ చేయడం వల్లే తన కొడుకు, ఆపై తన భర్త ఆత్మహత్యలు చేసుకున్నారని రాంబాబు భార్య ఆరోపించారు.
Next Story