Sun Mar 08 2026 01:50:36 GMT+0530 (India Standard Time)
ఘోరం.. పిల్లాడిని నేలకేసి కొట్టి చంపిన కసాయి తండ్రి
చికెన్ కర్రీ వండలేదని చెల్లెని, తల్లిని చంపడం, తాగేందుకు డబ్బివ్వలేదని భార్యను హతమార్చడం, విసిగిస్తున్నారని పిల్లలపట్ల..

మంచిర్యాల : సమాజంలో నేర ప్రవృత్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. రక్త సంబంధీకులు, కడుపున పుట్టిన పిల్లలు అన్న తేడా లేకుండా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కన్న మమకారం లేకుండా దారుణంగా హతమారుస్తున్నారు. చికెన్ కర్రీ వండలేదని చెల్లెని, తల్లిని చంపడం, తాగేందుకు డబ్బివ్వలేదని భార్యను హతమార్చడం, విసిగిస్తున్నారని పిల్లలపట్ల క్రూరంగా ప్రవర్తించిన ఘటనలు ఇటీవల చాలానే జరిగాయి. తాజాగా మరో క్రూరమైన ఘటన తెలంగాణలో జరిగింది. ఏడాది కూడా నిండని ఆ చిన్నారిని కన్నతండ్రే కిరాతకంగా చంపడం స్థానికంగా కలకలం రేపుతోంది.
రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన తండ్రి కొడుకుపట్ల కోపంతో ఊగిపోయాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. 11 నెలల వయసు కొడుకుని నేలకేసి కొట్టి చంపేశాడు. ఈ ఘటన చూసిన స్థానికులు హతాశులయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆ తండ్రి ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.
Next Story

