Tue Mar 17 2026 02:59:44 GMT+0530 (India Standard Time)
Road Accident : ఓవర్ స్పీడ్ యువకుడి ప్రాణం తీసింది
హైదాబాద్ లోని రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

అతి వేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. కారు చేతిలో ఉంటే ఇక యాక్సిలేటర్ పై కాలు తీయరు నేటి యువకులు. ఎంత స్పీడ్ వెళితే అంత హీరోయిజం. అదే చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హైదాబాద్ లోని రాయదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మల్కంచెరువు సమీపంలో అతి వేగంగా వచ్చిన కారు ఫ్లైఓవర్ ను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయింది.
మొహిదీపట్నానికి చెందిన...
దీంతో కారులో ప్రయాణిస్తున్న యువకుడు చరణ్ మరణించాడు. చరణ్ వయసు 19 సంవత్సరాలు. చరణ్ ఐసీఎఫ్ఏఐ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. మొహిదీపట్నానికి చెందిన చరణ్ జీఎన్ఆర్ హిల్స్ నుంచి తన ఇంటికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చరణ్ అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

