Thu Mar 19 2026 22:07:28 GMT+0530 (India Standard Time)
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురి మృతి
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. కారును టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం వెళుతున్న కారును టిప్పర్ ఢీకొనింది. వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టింది.
ఆరుగురికి గాయాలు...
ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తో పాటు మహిళ, ఇద్దరు చిన్నారులు మరణించారు. కారులో పదిమంది వరకూ ప్రయాణిస్తున్నారు. ఆరుగురు తీవ్రగాయాలపాలు కావడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

