Sat Sep 14 2024 23:32:18 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చుంచులూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కారును టెంటో ట్రావెలర్ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతులను బొటిక శ్రీనివాసులు, పుష్ప, శ్రీకాంత్ లుగా గుర్తించారు.
అతివేగమే...
అతి వేగంగా కారును నడపటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా టెంపోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story