Sun Mar 22 2026 20:39:29 GMT+0530 (India Standard Time)
బీహార్లో రోడ్డు ప్రమాదం : ఏడుగురి మృతి
బీహార్లోనూ మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు

బీహార్లోనూ మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. బీహార్లోని సీతామర్హి జిల్లాలోని మగోల్వా ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. త్రీవీలర్ ను మరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వీరంతా ఒక వివాహ వేడుకకు హాజరయి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
వివాహానికి వెళ్లి వస్తుండగా...
వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ కోసం పోలీసులు వెదుకుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

