Sat Sep 07 2024 11:12:36 GMT+0000 (Coordinated Universal Time)
జమ్మూలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు లోయలో పడి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన సాంబా జిల్లాలో జరిగింది. సాంబా నుంచి శ్రీనగర్ కు వెళుతుండగా కారు లోయలో పడింది. ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
లోయలో పడి....
ఒకరికి తీవ్ర గాయాలు పాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది లోయలో పడిన కారును, మృతదేహాలను వెలికి తీశారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు ఎక్కడి వారన్నది ఇంకా తెలియరాలేదు.
Next Story