Sun Nov 03 2024 03:42:30 GMT+0000 (Coordinated Universal Time)
పత్తి తోటలో గంజాయి సాగు
పత్తి పంటలో గంజాయి సాగు చేస్తూ ఒక రైతు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు
పత్తి పంటలో గంజాయి సాగు చేస్తూ ఒక రైతు ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డారు. సంగారెడ్డి జిల్లా మట్టుపల్లి మండలం ఉసిరికల గ్రామంలో మన్నె విటల్ అనే రైతు తనకు ఉన్న భూమిలో ప్రతి సాగు చేశాడని తెలిపారు. పత్తి సాగులో మధ్య మధ్యలో పదిహేడు గంజాయి మొక్కలను పెంచారని, ఈ మొక్కలను ఎండబెట్టి పత్తి చేనులో ఉన్నటువంటి కొట్టం గంజాయి మొక్కల నుంచి గంజాయిని వేరు చేసి గంజాయిని ఎండబెట్టి శుద్ధి చేశారన్నారు. అమ్మకానికి గంజాయిని తయారుచేసిన క్రమంలో శనివారం సంగారెడ్డి ఎక్సైజ్. ఎస్ టి ఎఫ్ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ పోలీసుల దాడిలో...
గంజాయి తో పాటు గంజాయి మొక్కల అవశేషాలను కూడా ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని పట్టుకున్న ఎస్.టి.ఎఫ్ టీమ్ లో సీఐ వీనారెడ్డి, ఎస్సై అనిల్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విఠల్, కానిస్టేబుళ్లు సతీష్ మోహన్ రామారావులు ఉన్నారు. ఇదే సంగారెడ్డి జిల్లాలో గత నెలలో మారేడుపల్లి గ్రామంలో పత్తి చేనులో 20 గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ రైతుపై కేసు నమోదు చేశారు. గంజాయిని పట్టుకున్నటువంటి ఎక్సైజ్ టీం ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఏ ఈ ఎస్ శ్రీనివాసరావు అభినందించారు.
Next Story