Sat Mar 07 2026 17:59:19 GMT+0530 (India Standard Time)
ప్రముఖ మోడల్ ఆత్మహత్యాయత్నం
ప్రముఖ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది.

ప్రముఖ మోడల్ ఆత్మహత్యకు పాల్పడింది. హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయ్ పూర్ కు చెందిన మోడల్ గుంగున్ ఉపాథ్యాయ్ జోధ్ పూర్ వచ్చి రతనాడ ప్రాంతంలోని ఒక హోటల్ లో రూమ్ అద్దెకు తీసుకుంది. తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.
కారణాలు మాత్రం....?
వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హోటల్ కు చేరుకునే లోపే గుంగున్ ఉపాథ్యాయ్ హోటల్ పై అంతస్థు నుంచి దూకేసింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

