Sun Mar 15 2026 20:57:43 GMT+0530 (India Standard Time)
Telangana : ఈరోజు పెళ్లి.. రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
పెళ్లికి హాజరయ్యేందుకు ట్రాక్టర్ లో వెళుతున్న కుటుంబం ప్రమాదాన బారిన పడింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు మరణించారు

పెళ్లికి హాజరయ్యేందుకు ట్రాక్టర్ లో వెళుతున్న కుటుంబం ప్రమాదాన బారిన పడింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు మరణించారు. పెళ్లి కుమార్తెను తీసుకు వచ్చేందుకు ముప్ఫయి మంది ట్రాక్టర్ లో బయలుదేరారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం బాచారం గ్రామానికి చెందిన రమేష్ కు ఆంథోల్ కు చెందిన మమతతో వివాహం జరగాల్సి ఉంది.
ఈరోజు పెళ్లి...
అయితే ఈరోజు వివాహం జరగాల్సి ఉండగా, పెళ్లికూతురును తీసుకు వచ్చేందుకు కుటుంబ సభ్యులు ముప్ఫయి మంది కలసి ట్రాక్టర్ లో బయలుదేరి వెళుతుండగా మన్సానిపల్లి మలుపు వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ముగ్గురు మహిళలు మరణిచండంతో పాటు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనతో వివాహాన్ని వాయిదా వేసుకున్నారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

