Sun Dec 14 2025 02:00:39 GMT+0000 (Coordinated Universal Time)
హోటల్ లో నలుగురు ఆత్మహత్య.. నిజామాబాద్ లో ఘటన
సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. రెండువారాలుగా అతను కుటుంబంతో కలిసి నిజామాబాద్ లోని ..

ఇద్దరు పిల్లలతో సహా భార్య,భర్త ఆత్మహత్యకు పాల్పడిన దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. హోటల్ గదిలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్రకలకలం రేపుతోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. నిజామాబాద్ లోని కపిల హోటల్లో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు ఆదిలాబాద్ కు చెందిన సూర్యప్రకాష్, భార్య అక్షయ, పిల్లలు ప్రత్యూష, అద్వైత్ లుగా గుర్తించారు.
సూర్యప్రకాష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. రెండువారాలుగా అతను కుటుంబంతో కలిసి నిజామాబాద్ లోని హోటల్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హోటల్ కు చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యలకు ఆర్థిక ఇబ్బందులు కారణమా ? లేక మరే ఇతర కారణాలున్నాయా ? అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story

