ఏడాది నుండి నడుస్తున్న నకిలీ పోలీసు స్టేషన్
నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, దాదాపు ఏడాది పాటు కార్యకలాపాలు కొనసాగించారు.

నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి, దాదాపు ఏడాది పాటు కార్యకలాపాలు కొనసాగించారు. కొందరిని కొట్టడం, సెటిల్మెంట్స్ చేయడం ఇలాంటి ఎన్నో పనులు అక్కడ జరిగాయి. తీరా చూస్తే అక్కడున్నోళ్లంతా ఫేక్ పోలీసులని, అదో ఫేక్ పోలీసు స్టేషన్ అని తేలింది. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో వెలుగులోకి వచ్చింది. రాహుల్‌కుమార్ షా పూర్ణియా జిల్లాలోని మోహని గ్రామంలో ఈ నకిలీ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశాడు. గ్రామీణ రక్షాదళ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానిక యువతను నమ్మించి వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు.
కానిస్టేబుల్, చౌకీదార్ వంటి పోస్టుల పేరుతో నియామకాలు కూడా చేపట్టాడు. యువకులకు పోలీసు యూనిఫాంలు, లాఠీలు, నకిలీ గుర్తింపు కార్డులు కూడా అందజేశాడు. గ్రామాల్లో పెట్రోలింగ్ చేయించడం, మద్యం అక్రమ రవాణాపై దాడులు చేపట్టారు. ఈ దాడుల ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగం తాను ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని నకిలీ ఉద్యోగులకు పంచిపెట్టేవాడు. ఇటీవల నిజమైన పోలీసులకు విషయం తెలియడంతో ప్రధాన సూత్రధారి రాహుల్ కుమార్ షా పరారయ్యాడు.