Wed Mar 11 2026 09:47:45 GMT+0530 (India Standard Time)
ఆసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం
మంచిర్యాల జిల్లాలో శిశువుల మార్పిడి కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది

మంచిర్యాల జిల్లాలో శిశువుల మార్పిడి కలకలం రేపింది. మంచిర్యాల జిల్లా ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మగశిశువు పుడితే ఆడబిద్దను ఇచ్చారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఒకేసారి ఇద్దరు మహిళలకు ఆపరేషన్ చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
తారుమారు చేశారంటూ...
కావాలని ఆసుపత్రి సిబ్బంది శిశువులను తారుమారు చేశారని ఆరోపిస్తున్నారు. తమకు మగశిశువు పుట్టినట్లు నర్సు చెప్పిందని బాధితులు అంటున్నారు. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఎవరి శిశువును వారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. శిశువులను శిశుసంక్షేమ శాఖకు అప్పగించారు.
Next Story

