Sat Dec 07 2024 02:25:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆటో బోల్తా, మహిళకు తీవ్రగాయాలు.. కారులో ఆస్పత్రికి తరలించిన జేసీ
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్ర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడగా..
అనంతపురం : ఆటో బోల్తా పడి.. ఓ మహిళ తీవ్రగాయాల పాలవ్వడంతో.. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన కారులో ఆస్పత్రికి తరలించారు. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్ర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడగా.. అందులో ప్రయాణిస్తున్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో తాడిపత్రి నుంచి వస్తోన్న మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రమాదాన్ని గ్రహించి.. బాధిత మహిళకు ఏం కాదమ్మా అంటూ ధైర్యం చెప్పారు.
తన కారులోనే ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం తన మనిషిని ఆస్పత్రిలో ఉంచి, మహిళను దగ్గరుండి చూసుకోవాలని చెప్పారు. కానీ.. దురదృష్టవశాత్తు మహిళను కాపాడేందుకు జేసీ చేసిన ప్రయత్నం విఫలమైంది. తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు బుక్కరాయ సముద్రం మండలం కొట్టాలపల్లి గ్రామానికి చెందిన మహిళగా గుర్తించారు.
Next Story