Sat Dec 13 2025 19:27:40 GMT+0000 (Coordinated Universal Time)
జేఎన్టీయూలో విద్యార్థిని బలవన్మరణం
కళాశాలలోని సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుండి కిందకు దూకి విద్యార్థిని మేఘనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్ కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. కళాశాలలోని సీఎస్ఆర్ బిల్డింగ్ పై నుండి కిందకు దూకి విద్యార్థిని మేఘనా రెడ్డి ఆత్మహత్య చేసుకుంది. మేఘన కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభావంగా 4వ సంవత్సరం చదువుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని.. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కు తరలించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. మానసిక ఒత్తిడితోనే మేఘన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story

