Tue Mar 03 2026 17:08:16 GMT+0530 (India Standard Time)
ఆ ఇంజినీర్ ను మావోలు..?
బీజాపూర్ అడవుల్లో ఇంజినీర్ అజయ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు.

బీజాపూర్ అడవుల్లో ఇంజినీర్ అజయ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. బీజాపూర్ లో వారం రోజుల క్రితం ఇంజినీర్ అజయ్ ను కిడ్నాప్ చేశారు. దీంతో ఇంజినీర్ అజయ్ భార్య అర్పిత తన చంటిబిడ్డను తీసుకుని అడవిలోకి వెళ్లింది. తన భర్తను వదిలిపెట్టాలని అన్నలను కోరింది. వారం రోజుల నుంచి అర్పిత అడవుల్లోనే తిరుగుతూ తన భర్త ను వదిలిపెట్టాలని అభ్యర్థిస్తుంది.
ప్రజా సంఘాల వత్తిడితో...
మరోవైపు మావోయిస్టు సంఘర్షణ సమితి కూడా ఇంజినీర్ ను వదిలిపెట్టాలని మావోయిస్టులను కోరింది. ప్రజా సంఘాలు కూడా అభ్యర్థించాయి. దీంతో మావోయిస్టులు సురక్షితంగా ఇంజినీర్ ను వదిలిపెట్టారు. ఆదివాసులు, మీడియా సమక్షంలో అజయ్ ను మావోలు వదిల పెట్టి, ప్రజాకోర్టును నిర్వహించారు.
Next Story

