Fri Sep 13 2024 01:12:49 GMT+0000 (Coordinated Universal Time)
టాలీవుడ్ డ్రగ్స్ కేసును వదలని ఈడీ.. మరోసారి?
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మరోసారి ఎక్సైజ్ శాఖకు లేఖ రాశారు
టాలీవుడ్ డ్రగ్స్ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. మరోసారి ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తమకు కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని ఆ లేఖలో ఈడీ పేర్కొంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ శాఖ అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ ను విచారించింది. డ్రగ్స్ కేసులో వారికున్న సంబంధాలపై ఆరా తీసింది. దాదాపు పదమూడు మంది టాలీవుడ్ సెలబ్రిటీలను విచారించింది.
పూర్తి వివరాలను....
అయితే ఈ కేసులో కొందరి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపింది. అయితే కోర్టులో మాత్రం వీరు డ్రగ్స్ వాడినట్లు తేలలేదని చెప్పింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈకేసును లోతుగా అధ్యయనం చేయాలని భావించి రికార్డులను కోరింది. కానీ అందుకు ఎక్సైజ్ శాఖ సహకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. అన్ని వివరాలను అందించాల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. దీంతో డ్రగ్స్ కేసులో నిందితుల వివరాలు, సాక్షుల వాంగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు ఇవ్వాలని మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఎక్సైజ్ శాఖను కోరింది.
Next Story