Thu Dec 11 2025 16:56:54 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో ఈడీ దాడులు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైెరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడుల వ్యవహారంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. మంగళగిరి ఎన్నారై ఆసుపత్రి, విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రుల్లో ఈడీ అధికారులు ఈ సోదాలు జరుగుతున్నాయి.
ఆసుపత్రుల్లో...
మొత్తం నాలుగు బృందాలుగా విడిపోయి ఆసుపత్రి డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేస్తున్నారు. అనేక అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఈడీ అధికారులు ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగుల సహకారంతో నగదును మళ్లించారన్న ఆరోపణలున్నాయి. ఈరోజు ఉదయం నుంచి తనిఖీలు ప్రారంభమయ్యాయి.
Next Story

