Sun Mar 08 2026 09:46:06 GMT+0530 (India Standard Time)
శరద్ పవార్ మనవడి ఇంట్లో ఈడీ సోదాలు
ఎన్సీపీ నేత శరద పవార్ మనవడు రోహిత్ పవార్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

ఎన్సీపీ నేత శరద పవార్ మనవడు రోహిత్ పవార్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు కుంభకోణంలో దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. రోహిత్ పవార్ కు చెందిన బారామతి ఆగ్రో దాని అనుబంధ సంస్థల్లో ఈరోజు ఈడీ దాడులు నిర్వహించింది. మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి.
2019లో ముంబయి పోలీసులు...
మహారాష్ట్ర సహకార సంఘం షుగర్ ఫ్యాక్టరీ కొనుగోలు వేలంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వినిపించాయి 2019లో ముంబయి పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసి తనిఖీలు చేపట్టారు. బారామతి ఆగ్రో కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా మళ్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
Next Story

