Sun Nov 10 2024 13:07:10 GMT+0000 (Coordinated Universal Time)
Chhattisgarh Encounter : ఛత్తీస్గడ్ లో మరోసారి ఎన్కౌంటర్
ఛత్తీస్గఢ్లో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. మావోయిస్టులకు ఇటీవల కాలంలో భారీ ఎదురుదెబ్బ తగులుతుంది.
ఛత్తీస్గఢ్లో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. మావోయిస్టులకు ఇటీవల కాలంలో భారీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఛత్తీస్గడ్ అడవుల్లో ఎన్కౌంటర్ లు వరసగా జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఎక్కువ మంది మావోయిస్టులు మృత్యువాత పడుతున్నారు. ఎండల తీవ్రతకు అడవుల్లో మంచినీరు కూడా దొరకక మైదానం ప్రాంతానికి వస్తారని తెలిసిన భద్రతాదళాలు కాపు కాసి మరీ వారిపై విరుచుకుపడుతున్నాయి. దీంతో మావోయిస్టులు వరసగా ప్రాణాలు కోల్పోతున్నారు.
మరో ఎన్కౌంటర్ జరగడంతో...
నిన్న కూడా ఛత్తీస్గడ్ లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లా గోగుండా అడవుల్లో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. ఛత్తీస్గఢ్లో తరచుగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. . ఆ సమయంలో అధికారులు భారీగా ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు.. ఈ ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టులు ఆదివారం ఛత్తీస్గఢ్లో బంద్కు పిలుపునిచ్చారు. కొన్ని రహదారుల్లో భారీ వృక్షాలను నరికి అడ్డంగా పడేశారు. నాలుగు విద్యుత్తు స్తంభాలను సైతం ధ్వంసం చేశారు.
Next Story