Wed Jan 21 2026 11:48:18 GMT+0000 (Coordinated Universal Time)
Security forces killed Top Maoists Leaders : భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావో అగ్రనేతల మృతి
ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం

Security forces killed Top Maoists Leaders :ఛత్తీస్గడ్ సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయినట్లు సమాచారం. డీవీసీ సభ్యుడు వర్గీష్, డీవీసీ మంాతు, డీవీసీ సభ్యులు కురుసాం రాజు, వెంకటేష్ లు మరణించినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా సమాచారం రాకపోయినప్పటికీ పోలీసులు అనధికారికంగా ధృవీకరించారు.
36 లక్షల రివార్డు...
మృతి చెందిన మావోయిలస్టులపై 36 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసుల చెబుతున్నారు. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఈ ఘటన జరిగింది. అయితే పోలీసు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం కావడంతో మిగిలిన వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. వారి కోసం అడవిలో గాలిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
Next Story

