Fri Dec 05 2025 19:56:37 GMT+0000 (Coordinated Universal Time)
భారీ ఎన్కౌంటర్ : ఆరుగురు మావోల మృతి
చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టు మృతి చెందారు

చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టు మృతి చెందారు. ఇప్పటి వరకు ఒక డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. నక్సలైట్లలో ఒక మహిళా నక్సలైట్ మృతదేహం కూడా ఉంది బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజాపూర్ సుక్మా సరిహద్దు ప్రాంతంలో చీపుర్భట్టి ప్రాంతంలో భద్రతా బలగాలు మరియు నక్సలైట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది
గాలింపు జరుపుతుండగా...
కోబ్రా, డీఆర్జీ జవాన్లు భద్రతా దళాల బృందంలో ఉన్నారు. హతమైన నక్సలైట్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సంఘటన స్థలంలో ఉన్న ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మరియు కోబ్రా సీఆర్పీఎఫ్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హోలీ రోజున నక్సలైట్లు ఈ ప్రాంతంలో ముగ్గురు గ్రామస్థులను చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జల్లెడ పడుతున్న భద్రతాదళాలకు మావోలు ఎదురుపడటంతో కాల్పులు జరిగాయి.
Next Story

