Fri Oct 11 2024 09:17:27 GMT+0000 (Coordinated Universal Time)
ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు మృతి
రాష్ట్రంలోని వేలూరు జిల్లా అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. కుమార్తె (13)
వేలూరు : ఛార్జింగ్ లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి తండ్రి, కూతురు మృతి చెందిన ఘటన తమిళనాడులో జరిగింది. రాష్ట్రంలోని వేలూరు జిల్లా అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్ గా పనిచేస్తున్నారు. కుమార్తె ప్రీతి (13) ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. రెండ్రోజుల క్రితమే దురై వర్మ ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోల చేశాడు. శుక్రవారం రాత్రి స్కూటర్ కు ఛార్జింగ్ పెట్టి తండ్రి, కూతురు పడుకున్నారు.
ఇద్దరూ నిద్రిస్తున్న సమయంలో.. స్కూటర్ ఓవర్ ఛార్జ్ అవడంతో పేలిపోయింది. పక్కనే ఉన్న మరో బైకుకు మంటలు అంటుకోవడంతో ఆ ఇంటి చుట్టూ పొగలు అలుముకున్నాయి. బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోని బాత్ రూమ్ లో వారిద్దరూ దాక్కున్నారు. అర్థరాత్రి కావడంతో ఎవరూ ప్రమాదాన్ని గ్రహించలేకపోయారు. ఆఖరికి ఊపిరాడక ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
Next Story