Mon Sep 25 2023 23:19:12 GMT+0000 (Coordinated Universal Time)
చేతబడి చేసిందన్న అనుమానంతో వృద్ధురాలిపై కిరోసిన్ పోసి..
చాలా ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాల మధ్య ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా దెయ్యాలు, భూతాలను నమ్మే వాళ్లు లేకపోలేదు.

ఓ వైపు టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అవుతూ ఉన్నా.. చాలా ప్రాంతాల్లో ఇంకా మూఢనమ్మకాల మధ్య ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఇంకా దెయ్యాలు, భూతాలను నమ్మే వాళ్లు లేకపోలేదు. జార్ఖండ్‌లోని సిమ్డేగా జిల్లాలో ఒక వృద్ధురాలిని సజీవ దహనం చేయాలని ప్రయత్నించారు స్థానికులు. ఒక గ్రామంలో ఆమె చేతబడి చేసిందనే అనుమానంతో స్థానికులు ఆమెకు నిప్పంటించారని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.
తీవ్రంగా గాయపడిన బాధితురాలు సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తేతైతంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుద్పాని దీపతోలి లోని బంధువుల ఇంటికి ఝర్యా దేవి వెళ్లగా గ్రామస్తులు కొందరు ఆమెపై దాడి చేశారు. తమ ఆరోగ్యం దెబ్బతినేలా చేతబడి చేసిందని ఆరోపిస్తూ స్థానికులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై కొందరు పోలీసులకు సమాచారం అందించారు, పోలీసులు అక్కడికి చేరుకుని ఝర్యా దేవిని రక్షించి సదర్ ఆసుపత్రికి తరలించారు.
Also Read : జగన్ తో భేటీ మామూలుగా జరగలేదు
గత వారం, కొలెబిరా పోలీస్ స్టేషన్ పరిధిలోని బెస్రజారా బజార్ సమీపంలో 32 ఏళ్ల వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపి, అతని శరీరానికి నిప్పంటించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గ్రామపెద్ద సుబున్ బడ్ను ఎట్టకేలకు పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది.
Next Story