Sat Mar 07 2026 23:19:36 GMT+0530 (India Standard Time)
Road Accident : ఘోర ప్రమాదం - ఎనిమిది మంది సజీవ దహనం
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బరేలిలోని భోజిపురా హైవే పై రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. బరేలిలోని భోజిపురా హైవే పై రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారు, వ్యాన్ ఢీకొట్టడంతో చెలరేగిన మంటల్లో కారులో ఉన్న ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. లారీ డ్రైవర్ మాత్రం తప్పించుకున్నారు. మృతుల్లో చిన్నారి కూడా ఉన్నారు. హైవేపై వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి అవతల వైపు రహదారిపైకి వెళ్లింది. అటుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో కారు మొత్తం తగలబడిపోయింది.
దూకే అవకాశం లేక...
కారులో నుంచి బయటకు దూకే అవకాశం లేక అందులోనే ఉండిపోవడంతో వారు మొత్తం సజీవ దహనమయ్యారు. ఒక పెళ్లి బృందం ఈ కారులో ప్రయాణిస్తున్నట్లు ప్రాధమికంగా అందుతున్న సమచాారం తెలిసింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అయితే ఎవరెవరు మరణించారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు వెంటనే ప్రారంభించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

