Thu Mar 19 2026 09:26:10 GMT+0530 (India Standard Time)
Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఎనిమిది మంది స్పాట్ డెడ్
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మరణించారు

విజయవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మృతుల్లో ఒక మహిళ ఉన్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు దగ్గర వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో...
అలాగే తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లి దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నెల్లూరు వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.
Next Story

