Wed Jan 28 2026 23:51:49 GMT+0000 (Coordinated Universal Time)
వ్యక్తిగత కారణాలవల్లనే హత్య : పోలీసులు
వ్యక్తిగత కారణాలవల్లే కుటాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు

వ్యక్తిగత కారణాలవల్లే కుటాలపల్లికి చెందిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని డీఎస్పీ వాసుదేవన్ తెలిపారు. నల్లమాడ మండలం కుటాలపల్లి లో ఆదివారం రాత్రి జరిగిన అమర్నాథ్ రెడ్డి హత్య జరిగిందని, ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి , డీఎస్పీ వాసుదేవన్ పరిశీలించారు. ఈ హత్య కేసును వెంటనే ఛేదించాలని ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈనేపథ్యంలో హత్య ఘటనకు సంబంధించిన ప్రాథమిక వివరాలను వెల్లడించారు.
ప్రాధమిక దర్యాప్తులో...
పుట్టపర్తి డీఎస్పీ వాసుదేవన్ విడుదల చేసిన ప్రకటన ప్రకరాం నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి వ్యక్తిగత కారణాలవల్లే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఈ హత్యకు ఎటువంటి రాజకీయ కోణం లేదని, కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని తెలుస్తోందని, ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని త్వరలోనే అమర్నాథ్ రెడ్డి హత్యకు గల కారణాలను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
Next Story

