Sun Mar 15 2026 14:49:55 GMT+0530 (India Standard Time)
ప్రధాని పర్యటన భద్రత ఏర్పాట్లను పరిశీలిస్తూ గుండెపోటుతో డీఎస్పీ మృతి
ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో మరణించారు

ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన డీఎస్పీ గుండెపోటుతో మరణించారు. తిరుమల శ్రీవారి మెట్ల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాత్రికి తిరుమల చేరుకుంటారు. అందుకోసం భద్రత ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇంటలిజెన్స్ డీఎస్పీ కృపాకర్ వచ్చారు.
ప్రధాని భద్రత ఏర్పాట్లను...
ఆయన శ్రీవారి మెట్ల మార్గం వద్ద పరిశీలిన చేస్తున్నారు. అయితే 1,805 మెట్టు వద్ద ఉండగా ఆయన ఒక్కసారిగా గుండెపోటుతో కుప్ప కూలిపోయారు. వెంటనే సిబ్బంది ఆసుపత్రికి తరలించినా ఫలితం లేదు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కృపాకర్ స్వస్థలం విజయవాడ సమీపంలోని పోరంకి అని అధికారులు చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న డీఎస్పీ మరణించడంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Next Story

